Current Affairs Telugu Daily

భారత్, సియెర్రా లియోన్ మధ్య ఆరు ఒప్పందాలు

*భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సియెర్రా లియోన్ అధ్యక్షుడు జులియస్ మాడా బియో ల సంయుక్త ప్రకటన -- ప్రపంచంలో మూడింట ఒక వంతు జనాభా నివసిస్తున్న ఆఫ్రికా, భారత్‌కు ఐరాస నిర్ణాయక విభాగాల్లో సరైన ప్రాతినిధ్యం కొరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం గురించి ప్రకటన విడుదల చేశారు. 
*సియెర్రా లియోన్ పర్యటనకు వెళ్లిన తొలి భారత ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు.
*వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, సమాచార సాంకేతికత, మౌలిక వసతుల అభివృద్ధిలో పరస్పరం సహకారం కొరకు నిర్ణయించారు. 
*వివిధ రంగాలకు సంబంధించి సియెర్రా లియోన్‌కు భారత్ 217.5 మిలియన్ డాలర్ల సహాయం అందించింది. 
* నీటిపారుదల అభివృద్ధికి మరో 30 మిలియన్ డాలర్లు, తాగునీటి ప్రాజెక్టుకు 15 మిలియన్ డాలర్ల రుణం భారత్ అందించనుంది. 
*అంతర్జాతీయ సౌర కూటమిలో చేరికకు సియెర్రా  అంగీకారం.


views: 607

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams