Current Affairs Telugu Daily

ఆగస్టులో పారిశ్రామికరంగ వృద్ధి 

*పదేండ్ల కనిష్ఠానికి కీలక రంగాల వృద్ధి పడిపోయింది.  క్యాపిటల్ గూడ్స్, వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఆగస్టు నెలకుగాను పారిశ్రామికరంగం 1.1 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంది. 
*  రెండేండ్లలో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి కాగా, గత ఏడు సంవత్సరాలలో ఇదే అత్యల్పం.
*2018 ఆగష్టులో 4.8 శాతం పారిశ్రామిక వృద్ధి రేటు. 
*ముఖ్య కారణం -  దేశీయ పారిశ్రామిక ప్రగతిలో 77 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి పడిపోవడం.
*తయారీ రంగంతోపాటు విద్యుత్ కూడా ప్రతికూల వృద్ధియైన - 0.9 శాతం నమోదు చేసుకోగా,మైనింగ్‌ విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది.  
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఐఐపీ(పారిశ్రామిక ఉత్పత్తుల సూచీ ) 2.4 శాతానికి పరిమితమైంది. 
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిని 6.9 శాతం నుంచి 6.1 శాతానికి రిజర్వు బ్యాంక్ తగ్గించింది.


views: 647

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams