Current Affairs Telugu Daily

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ మేరీకోమ్‌కు కాంస్యం

*ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ భారత వెటరన్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ జడ్జిల వివాదాస్పద నిర్ణయంతో సెమీ ఫైనల్‌లో ఓటమిపాలై కాంస్యం పొందింది.
*ఈ టోర్నమెంట్‌లో మహిళల 51 కిలోల విభాగంలో సెమీస్‌కు చేరిన మేరీకోమ్‌ టర్కీకి చెందిన రెండో సీడ్‌ బుసెనాజ్ కాకిరోగ్లుతో తలపడింది.
*కాంస్యం గెలిచిన మేరీకోమ్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చరిత్రలోనే అత్యధిక పతకాలు గెలిచిన బాక్సర్‌గా సరికొత్త రికార్డ్‌ నెలకొల్పింది.
*ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మేరీకి  ఇది ఎనిమిదవ పతకం. ఇప్పటి వరకు మేరి తన కెరీర్‌లో ఆరు బంగారు, ఒక సిల్వర్‌, ఒక కాంస్య పతకాలను సాధించారు. 
*ఇటీవల 48 కేజీల విభాగం నుంచి 51 కేజీల కేటగిరీకి మేరీకోమ్‌ మారారు.
*పద్మ విభూషణ్‌ అవార్డుకు మేరీకోమ్‌ నామినేట్ అయ్యారు. ఈ అవార్డుకు నామినేట్‌ అయిన మొదటి మహిళ అథ్లెట్‌గా ఆమె ఘనత సాధించారు.  


views: 679



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams