Current Affairs Telugu Daily

హైదరాబాద్ లో వేదికగా వరల్డ్ డిజైన్ అసెంబ్లీ

*హైదరాబాద్ వేదికగా వరల్డ్ డిజైన్ అసెంబ్లీ అక్టోబర్ 11న ప్రారంభమయింది. 11,12 వ తేదీల్లో ఈ సదస్సు నిర్వహిస్తారు.
*హెచ్‌ఐసీసీలో రెండురోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రముఖ డిజైనర్లు, ప్రతినిధులు హాజరుకానున్నారు.
*నిర్వహించేవారు - వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీవో), తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం. 
*భారతదేశంలో  డబ్ల్యూడీఏ సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి.
* ఇది  డబ్ల్యూడీఏ 31వ సదస్సు.
*థీమ్ - హ్యూమనైజింగ్ డిజైన్
*. రెండేండ్లకోసారి జరిగే డబ్ల్యూడీఏ సదస్సును 1959 లో తొలిసారి స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో నిర్వహించారు. 2007లో అమెరికా, 2009 లో సింగపూర్, 2011లో తైవాన్, 2013లో కెనడా, 2015లో దక్షిణ కొరియా, 2017లో ఇటలీ ఈ సదస్సుకు ఆతిథ్యమిచ్చాయి.


views: 687



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams