Current Affairs Telugu Daily

యునిసెఫ్‌ సుహృద్భావ రాయబారిగా లిల్లీసింగ్‌ 
భారత సంతతి యూట్యూబ్‌ తార లిల్లీసింగ్‌ను యునిసెఫ్‌ సుహృద్భావ రాయబారిగా నియమించింది. 2017 జులై 15న న్యూఢిల్లీలో  జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో యునిసెఫ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. యూత్‌ 4 ఛేంజ్‌ పేరుతో యునిసెఫ్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు లిల్లీ ఇక్కడికి వచ్చారు. కెనడాలో పుట్టి పెరిగిన లిల్లీ యూట్యూబ్‌లో సూపర్‌ వుమన్‌ పేరుతో విశేష ఆదరణ సంపాదించారు. దాదాపు 1.2 కోట్ల మంది ఈ వేదికలో ఆమెను అనుసరిస్తున్నారు. లిల్లీ తల్లిదండ్రులు పంజాబ్‌కు చెందినవారు.
views: 884

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams