Current Affairs Telugu Daily

రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

* లిథియం–అయాన్‌ బ్యాటరీ రూపకర్తలైన ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు.స్మార్ట్‌ఫోన్ల నుండి విద్యుత్తు బస్సుల వరకూ అన్నింటినీ నడిపే అత్యంత శక్తిమంతమైన బ్యాటరీని తయారు చేసారు. 
*అమెరికాకు చెందిన జాన్‌ గుడినఫ్
 బ్రిటన్‌ శాస్త్రవేత్త స్టాన్లీ విటింగ్‌హమ్
 జపాన్‌కు చెందిన అకిరా యోషినొ
*ప్రైజ్‌మనీ - 9,14,000(రూ. 6.5 కోట్లు)
*వీరిలో 97 ఏళ్ల వయసులో ఈ పురస్కారం అందుకోనున్న గుడినఫ్‌ నోబెల్‌ పురస్కార గ్రహీతల్లో అత్యంత పెద్ద వయస్కుడు.
*వీరు రూపొందించిన తక్కువ బరువుండే రీచార్జ్‌ చేయగల లిథియం బ్యాటరీలు ఎలక్ట్రానిక్‌ రంగంలో బాగా ఉపయోగపడతాయి .మొబైల్‌ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వీటినే వినియోగిస్తున్నారు.
*ఇవి సౌర, పవన శక్తిని సైతం స్టోర్‌ చేసుకోగలవు.శిలాజేతర ఇంధన రహిత సమాజం సాధ్యమయ్యేలా వీరి పరిశోధనలు పనికొస్తాయి.
*సౌర, పవన విద్యుత్తును సమర్థంగా తనలో నిక్షిప్తం చేసుకోగల ఈ బ్యాటరీలు పెట్రోలు, డీజిళ్లపై ఆధారపడటాన్ని తగ్గించి పర్యావరణానికి ఎంతో మేలు చేశాయి.
* స్టాన్లీ విటింగ్‌--- టైటానియం డైసల్ఫైడ్‌ అతితక్కువ స్థలంలో ఎక్కువ మోతాదులో విద్యుత్తును నిల్వ చేసుకోగలదు.మెటాలిక్‌ లిథియంతో తయారైన ఆనోడ్‌ను ఉపయోగించినప్పుడు రెండు వోల్టుల సామర్థ్యమున్న తొలి లిథియం అయాన్‌ బ్యాటరీ తయారైంది.
*జాన్‌ గుడ్‌ ఇనఫ్‌ --కాథోడ్‌ను మెటల్‌ సల్ఫైడ్‌తో కాకుండా మెటల్‌ ఆక్సైడ్‌తో తయారు చేస్తే సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చునని కనుగొన్నారు. కోబాల్ట్‌ ఆక్సైడ్‌ను వాటం ద్వారా సామర్థ్యాన్ని నాలుగు వోల్టులకు పెంచగలిగారు.
* 1991లో వాణిజ్యస్థాయిలో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ మొదలు కావడంతో మొబైల్‌ఫోన్ల సైజు తగ్గడంతోపాటు ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లూ, ఎంపీ3 ప్లేయర్లు అందుబాటులోకి వచ్చేశాయి.


views: 689



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams