Current Affairs Telugu Daily

చక్కటి ఆరోగ్యం, పోషకాహారం అందించే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

* ఆరోగ్యం, పోషకాహారం అందించడంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
*నీతి ఆయోగ్‌ నివేదిక -- మొత్తం దేశంలోని 117 ఆశావహ జిల్లాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు ప్రకటించింది.ఆగస్టు–2019 డెల్టా ర్యాంకులను గతంలో ఆరోగ్యం, పోషకాహారం వంటి విషయాల్లో భూపాలపల్లి జిల్లా స్కోరు 64గా ఉండగా,ఈసారి 73కు చేరింది. దీంతో మూడో ర్యాంకు సాధించింది. 
* డెల్టా ర్యాంకింగ్‌లో ఇతర అంశాలతోపాటు ఆరోగ్యం, పోషకాహారానికి 30 శాతం మార్కులను కేటాయిస్తారు.గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, వారి ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిగణనలోకి తీసుకుంటారు. 32 ఆరోగ్య, పోషకాహార అంశాలపై ఈ ర్యాంకింగ్‌ను నిర్ధారించారు. 
*ఎనీమియాతో బాధపడుతున్న మహిళలను గుర్తించి వారికి సరైన వైద్యం అందించడంలో చేసిన కృషికి మార్కులు వేస్తారు.
*స్త్రీ, పురుషుల నిష్పత్తి, ఆస్పత్రుల్లో ప్రసవాలు, శిశువు పుట్టిన గంటలోపు తల్లి పాలు అందించడం, తక్కువ బరువుతో పుట్టే శిశువుల శాతాన్ని తగ్గించడం, ఐదేళ్లలోపు తక్కువ బరువున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ, డయేరియా రాకుండా చిన్నారులకు వోఆర్‌ఎస్‌ వంటి పానీయాలు అందించడంలో చేస్తున్న కృషిని నీతి ఆయోగ్‌ పరిశీలించింది. 
*క్షయ వ్యాధి నివారణకు చేపడుతున్న చర్యలు, సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను  పరిగణలోకి తీసుకుంది.
*డెల్టా ర్యాంకింగ్‌లో ఆసిఫాబాద్‌ జిల్లా 39వ ర్యాంకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 63వ ర్యాంకు సాధించాయి.


views: 665

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams