Current Affairs Telugu Daily

దక్షిణ భారతదేశంలో తగ్గనున్న వరి దిగుబడి 
వాతావరణం మార్పులు ఆసియాలో వినాశకరమైన ప్రభావాన్ని చూపనున్నాయి. పసిఫిక్‌, ఆసియా దేశాల్లో దుష్పరిణామాలు తలెత్తనున్నాయి. 2030 నాటికి దక్షిణ భారతదేశంలో వరి దిగుబడి 5 శాతం, 2050 నాటికి 14.5 శాతం, 2080 నాటికి 17 శాతం మేరకు తగ్గనుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు, పోస్ట్‌మ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్లైమేట్‌ ఇంపాక్ట్‌ రీసెర్చి సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం తుఫాన్ల కారణంగా ఆసియాలో అత్యధికులు వరదల వల్ల ఇబ్బందులు పడనున్నారు. ముఖ్యంగా చైనా, భారత్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేషియా దేశస్థులపై ఈ ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ శతాబ్దం చివరి నాటికి బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 13 కోట్ల మంది లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి ఉంటుంది. 136 తీరప్రాంత నగరాలపై జరిపిన అధ్యయనం మేరకు 2005లో వరద వల్ల దాదాపు రూ.390 కోట్లు నష్టం వాటిల్లింది. 2050 నాటికి ఇది రూ.3350 కోట్లు ఉండవచ్చు. 2005 నుంచి 2050 వరకు అధికంగా నష్టపోయే 20 నగరాల్లో ముంబయి, కోల్‌కతా కూడా ఉన్నాయి.
views: 1426



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams