Current Affairs Telugu Daily

సూర్యుడు అంతమయ్యే వరకు టార్డిగ్రేడ్‌ ప్రస్థానం
నీటి ఎలుగుబంటిగా వ్యవహరించే టార్డిగ్రేడ్ల ప్రస్థానం మరో వెయ్యి కోట్ల ఏళ్ల వరకు ఢోకా లేదని ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. వీటిని సమూలం గా నిర్మూలించే పరిణామమేదీ జరిగే అవకాశం లేదని, సూర్యుడు అంతమయ్యే వరకు వీటి ప్రస్థానం కొనసాగుతుందని తాజాగా తేల్చారు. భూమి మీద సముద్రాలు ఆవిరయ్యే స్థాయిలో ఉష్ణాన్ని కలిగించే పరిస్థితులు మాత్రమే టార్డిగ్రేడ్లను సమూలం గా నిర్మూలిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
- భూమి మీద ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడే జీవిగా బొద్దింకకు పేరు ఉంది. 
- అయితే టార్డిగ్రేడ్‌లు వీటి కన్నా దృఢమైనవని ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. 
- నీటిలో జీవించే ఈ 8 కాళ్ల వింత జీవులు గరిష్టంగా అర మిల్లీమీటరు మాత్రమే పెరగగవు. 
- ఆహారం, నీరు లేకుండా 30  సం॥ల పాటు జీవించగవు. 
- 150 డిగ్రీ సెల్సియస్‌ వేడిని కూడా తట్టుకోగలవు. సముద్ర గర్భంలోని కఠిన పరిస్థితులు, అంతరిక్షంలోని శీతల, శూన్య వాతావరణాన్ని ఇవి తట్టుకొని నిలబడగలవు. 
- మానవుడికి ప్రమాదకరంగా పరిణమించే స్థాయి కన్నా 100 రెట్లు ఎక్కువ మోతాదులో రేడియో ధార్మికతను చాలా తేలిగ్గా తట్టుకుంటాయి. 
- ఇవి సగటున 60 ఏళ్ల వరకు జీవిస్తాయి.

views: 1009

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams