Current Affairs Telugu Daily

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై రివ్యూ పిటిషన్‌

*మార్చి 20, 2018లో సుప్రీం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు అనుమతించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
*సుప్రీంకోర్టు తీర్పు- 1. అరెస్టుకు ముందస్తు అనుమతి తప్పనిసరన్న గత ఆదేశాలను సుప్రీంకోర్టు తోచిపుచ్చింది.
2.ఎఫ్‌ఐఆర్ నమోదుకు ప్రాథమిక విచారణ అవసరమన్న ఆదేశాలనూ సుప్రీంకోర్టు  మార్చేసింది .
*గత ఉత్తర్వులను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో యథావిధిగా తక్షణ అరెస్ట్‌ అమల్లోకి వస్తుంది. అలాగే ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందస్తు దర్యాప్తు కూడా అవసరం లేదు. 
*ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ఆర్టికల్ 15 ఆధారంగా వారికి ప్రత్యేక రక్షణ కల్పించిందనీ, అయినప్పటికీ వారు సమాజంలో సామాజిక బహిష్కరణకు గురవుతున్నారని ధర్మాసనం తెలిపింది.
*ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టులకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు 2018 మార్చి 20న కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
*గత ఏడాది ఇచ్చిన తీర్పు---చాలా సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం  దుర్వినియోగం అవుతుంది,ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్షణం అరెస్ట్‌ చేయడం కుదరదని తీర్పునిచ్చింది. ప్రభుత్వ అధికారులు ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్‌ అవడం వల్ల వారి విధి నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది.ముందస్తు బెయిల్‌ ఇవ్వడంపై ఎలాంటి నిషేధాలు ఉండవు. ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసేందుకు ఉన్నతస్థాయి అధికారి అనుమతి అవసరం.
* ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఆందోళనలు చేపట్టాయి.


views: 686



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams