Current Affairs Telugu Daily

సాయుధ బలగాల ట్రిబ్యునల్ నూతన చైర్మన్

* సాయుధ బలగాల ట్రిబ్యునల్ తదుపరి చైర్మన్‌గా ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్ పేరును సీజేఐ రంజన్ గొగోయ్ ప్రతిపాదించారు.
*సాయుధ బలగాల ట్రిబ్యునల్ ప్రస్తుత చైర్మన్ జె.రవీందర్ సింగ్ అక్టోబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు.
* సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదన- ట్రిబ్యునల్ మెంబర్ల నియామక ప్రక్రియకు సంబంధించి ఫైనాన్స్ చట్టం నిబంధనలు సవాళ్లను ఎదుర్కొంటున్నందున ఆ అంశం తేలేవరకు నియామకాలను వాయిదా వేయాలి.
* కోర్టు ఆయన వాదనను తోసిపుచ్చింది. 
*సాయుధ బలగాల ట్రిబ్యునల్ --దీనిని  సాయుధ బలగాల క్రిమినల్ చట్టం 2007 ప్రకారం, 2009లో ఏర్పాటు చేశారు.
*సాయుధ బలగాలకు సంబంధించిన  నియామకాలు, ఏర్పాటు, ఎన్రోల్మెంట్, సర్వీస్ నియమాలకు సంబంధించిన వివాదాలు, ఫిర్యాదులను  పరిశీలిస్తుంది. 
*దీని ప్రధాన బెంచ్ ఢిల్లీలో మరియు ప్రాంతీయ  బెంచీలు జైపూర్, లక్నో, చండీగర్, కలకత్తా, చెన్నై,  గౌహతి లో కలవు.


views: 730



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams