Current Affairs Telugu Daily

అంటార్కిటికా ఖండం నుంచి విడివడిన భారీ మంచు ఫలకం
అంటార్కిటికా ఖండం నుంచి ట్రిలియన్‌ (లక్షల కోట్ల) టన్నుల బరువైన మంచు ఫలకం విడివడిందని శాస్త్రవేత్తలు  జూలై 12న వెల్లడించారు.దీంతో దక్షిణ ధ్రువం, పరిసర ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న ఓడలు పెను ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. 5,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ మంచుగడ్డ ఇప్పటివరకు అంటార్కిటికా నుంచి వేరైన వాటిలో అతిపెద్దది. జూలై 10 తర్వాత ఏదో ఓ సమయంలో ఇది లార్సెన్‌-సీ 27 హిమపర్వతం నుంచి వేరుపడిందనీ, తత్ఫలితంగా లార్సన్‌-సీ విస్తీర్ణం 12 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు చెప్పారు. మంచుఫలకానికి ఏ68 అని పేరు పెట్టే అవకాశం ఉందనీ, అంటార్కిటికా ద్వీపకల్ప రూపురేఖనే ఇది మార్చేసిందని వారు పేర్కొన్నారు. చిన్నచిన్న మంచుగడ్డలు అంటార్కిటికా నుంచి విడిపోవడం మామూలుగా జరిగేదే. అయితే ఇది భారీ మంచు ఫలకం కాబట్టి ఓడలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. నాసా పరికరాలతో గుర్తింపు మంచుగడ్డ విడిపోవడాన్ని నాసాకు చెందిన ఆక్వా మోడిస్‌ ఉపగ్రహ పరికరం ద్వారా గుర్తించిన శాస్త్రజ్ఞులు, సువోమి వీఐఐఆర్‌ఎస్‌ పరికరంతో నిర్ధారించారు. గత ఏడాది కాలంగా లార్సెన్‌-సీపై వస్తున్న పగుళ్లను యూరోపియన్‌  అంతరిక్ష సంస్థకు చెందిన ఉపగ్రహా ద్వారా పరిశీలించారు. ఈ మంచుగడ్డ హిమకొండ నుంచి విడిపోతుందని శాస్త్రవేత్తలు అప్పుడే గుర్తించారు. లార్సెన్‌-బి మంచుకొండలో కూడా 1995లో పగుళ్లు ఏర్పడి మంచుగడ్డు విడివడి 2002 నాటికి చాలా చిన్నదైపోయిందనీ, ఇప్పడు లార్సెన్‌-సీ కూడా అలాగే అవ్వొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
views: 1003

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams