Current Affairs Telugu Daily

ఐరాస సాధారణ సభ 74వ సమావేశం --  మోదీ ప్రసంగం

* మోడీ ప్రసంగం వివరాలు---ప్రపంచానికి మేం యుద్ధాన్ని ఇవ్వలేదు.. బౌద్ధాన్ని ఇచ్చాం. అంటే గౌతమ బుద్ధుడు ప్రవచించిన శాంతి సందేశాన్నిచ్చాం. అందుకే ఉగ్రవాదంపై ప్రపంచానికి మేం చేసే హెచ్చరికలో ఆగ్రహం, తీవ్రత, ఆవేదన, మా నిబద్ధత ఉంటాయి.. ఉగ్రవాదం చేస్తున్న నష్టంపై ప్రపంచదేశాలు ఆగ్రహించడం అవసరం. మానవాళి శ్రేయస్సు కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపై నిలవడం ఇపుడు అత్యవసరం అని మోడీ ప్రసంగించారు . 
*సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌ అనే  నినాదం ఇచ్చారు. 
*సైనికుల గురించి  మోడీ ప్రసంగం-- ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయేది భారత సైనికులే. 160 మంది భారతీయులు మరణించారు. 
* జనకల్యాణ్‌ నుంచి జగ్‌కల్యాణ్‌కు భారతదేశ ప్రయాణం.కృషి మాది, ఫలాలు అందరివీ అని పేర్కొన్నారు. 
*మోడీ ప్రసంగం లో తమిళ కవిత్వం- తమిళ కవి కనియాన్‌ పుంగుద్రనార్‌ 3వేల ఏళ్ల కిందటే అన్న మాటను ఉటంకించారు. ‘మేం అన్ని ప్రాంతాలకూ చెందిన వారం.. అందరి వాళ్లం’ .
*ప్రధాని మోదీ పేర్కొన్న రెండు ప్రధాన అంశాలు 
1. వాతావరణ మార్పులు
2.ప్లాస్టిక్‌ నిర్మూలన.
*450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యం గురించి మోడీ ప్రస్తావించారు. 


views: 653



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams