Current Affairs Telugu Daily

భూ వివాదాలు, మోసాలు, వేధింపుల న్యాయ సహాయానికి రోబో న్యాయవాది
భూ వివాదాలు, క్రెడిట్‌ కార్డు మోసాలు, పని ప్రదేశాల్లో వేధింపులకు సంబంధించిన కేసుల్లో వ్యక్తులకు దోహదపడే దిశగా ప్రపంచంలోనే తొలిసారిగా రోబో న్యాయవాది అందుబాటులోకి వచ్చింది. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న బ్రిటన్‌ విద్యార్థి జోషువా బ్రౌడర్‌ ఈ ఆన్‌లైన్‌ సాధనాన్ని రూపొందించారు. పార్కింగ్‌ టిక్కెట్లకు సంబంధించిన వివాదాల్లో ఇప్పటికే ఈ ఆవిష్కరణ సేవలందిస్తోంది. తాజాగా భూ వివాదాల వంటి పలు కేసుల్లో న్యాయ సహాయం అందించేలా దీని సామర్థ్యాన్ని మరింత పెంచారు. డునాట్‌ పే అనే వెబ్‌సైట్‌లో వినియోగదారులు తమ సమస్యను విన్నవిస్తే ఈ రోబో న్యాయ సహాలు, సూచనలు అందిస్తుంది.
views: 1035



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams