Current Affairs Telugu Daily

 సీఆర్‌పీసీ సెక్షన్‌ 102 

*విచారణ సమయంలో నిందితుల స్థిరాస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
* సీఆర్‌పీసీ సెక్షన్‌ 102 ప్రకారం విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఇది  చెల్లుబాటు కాదని ఇటీవల ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది.
*దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
*ఈ నేపథ్యంలో సీఆర్‌పీసీ 102 పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, సంజయ్‌ ఖన్నాల ధర్మాసనం విచారణ జరిపింది.


views: 673



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams