Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి  ‘క్లైమేట్‌ ఎమర్జెన్సీ సమిట్‌’ నరేంద్ర మోదీ ప్రసంగం 

*ఐక్యరాజ్యసమితి వేదికగా సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్‌ నేతృత్వంలో వాతావరణ మార్పుపై జరిగిన శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు.పారిస్‌ ఒప్పంద అమలుపై కార్యాచరణను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. 
నరేంద్ర మోడీ ప్రసంగం లోని అంశాలు---వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు,అంతర్జాతీయ సమాజంతో కలిసి వినూత్న కార్యక్రమాలతో పురోగతి.
*లక్షల కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు,మిషన్‌ జల్‌జీవన్‌తో నీటి కాలుష్యాన్ని నియంత్రణ. 
*  ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేందుకు అంతర్జాతీయ టెక్నాలజీ ఉపయోగించడం.
*ఒక సమగ్ర కార్యాచరణ, అంతర్జాతీయ స్థాయి ఉద్యమం ఆవశ్యకతను  మోడీ ప్రస్తావించారు. 
*  మనల్ని ముందుకు నడిపించాల్సింది అవసరమే కానీ అత్యాశ కాదు’ అని మోడీ పేర్కొన్నారు.ఇందుకు విద్య నుంచి విలువల వరకు వ్యక్తిగత స్థాయిలో మార్పుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. 
* పారిస్‌ ఒప్పందంలో భాగంగా శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యం 150 గిగావాట్లు. భారత్‌లో బయో ఫ్యూయల్‌ను పెట్రోల్, డీజిల్‌లలో కలిపే కార్యక్రమం ప్రారంభించిందని పేర్కొన్నారు. 
*నీటి సంరక్షణ, వర్షం నీటిని సంరక్షించుకోవడం లక్ష్యంగా ప్రారంభించిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పథకంపై రానున్న కొన్ని సంవత్సరాలలో రూ. 3.5 లక్షల కోట్లు  ఖర్చు చేయబోయే అంశాన్ని ప్రస్తావించారు.
* వాతావరణ మార్పును ప్రతికూలతపై యుద్ధం ప్రకటించేందుకు ఐరాస ‘క్లైమేట్‌ ఎమర్జెన్సీ సమిట్‌’60 దేశాల ప్రతినిధులతో నిర్వహించారు. 


views: 634



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams