Current Affairs Telugu Daily

ఇంటర్నెట్‌ వినియోగ హక్కు-- కేరళ హైకోర్టు తీర్పు

* ఇంటర్నెట్‌ వినియోగ హక్కు అనేది విద్యాహక్కు, గోప్యతా హక్కులో భాగమేనని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.ఇది ప్రాథమిక హక్కులలో భాగమని పేర్కొంది .
*నిషేధిత సమయంలో మొబైల్‌ ఫోన్‌ను వినియోగించిందనే కారణంతో ఓ విద్యార్థినిని కోజికోడ్‌లోని శ్రీనారాయణగురు కళాశాల యాజమాన్యం కాలేజీ హాస్టల్‌ నుంచి బహిష్కరించడాన్ని కోర్టు తప్పుపట్టింది.
*కేరళ హైకోర్టు తీర్పు--ఇంటర్నెట్‌ వినియోగ హక్కు అనేది ప్రాథమిక స్వేచ్ఛ అని, విద్యాహక్కు అమలుకు అదో పనిముట్టు అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి స్పష్టం చేసిన నేపథ్యంలో, విద్యార్థులకున్న ఆ హక్కును హరించే ఏ నిబంధననూ కోర్టు సమ్మతించదు అని తీర్పు ఇచ్చింది.
*విద్యార్థిని చదువుతున్న కళాశాల నిబంధనల ప్రకారం.. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు విద్యార్థులు మొబైల్‌ ఫోన్లు వినియోగించడానికి వీల్లేదు.


views: 654

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams