Current Affairs Telugu Daily

తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లు-2019 ఆమోదం

*  ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లు-2019ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 
*రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో, నగరాల్లో పాలన కోసం ఆరు వేరువేరు చట్టాలు అమలులో ఉన్నాయి.
*తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-1965, తెలంగాణ మున్సిపల్ చట్టం-1994, టౌన్ మరియు కంట్రీ ప్లానింగ్ చట్టం-1920, అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ చట్టం-1975, జీహెచ్‌ఎంసీ యాక్ట్-1955, హెచ్‌ఎండీఏ యాక్ట్-2008 ఈ ఆరు చట్టాలు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులకు తగ్గట్లు రూపొందిచారు.
* దీని ప్రధాన ఉద్ధేశ్యం టీ-ఎస్ ఐపాస్ ఏ విధంగానైతే విజయవంతమైందో, (అంటే పరిశ్రమల అనుమతులను వేగవంతం చేయడం) ఈ చట్టం ద్వారా కూడా పారదర్శకమైన అనుమతులను, విధానాలను తీసుకురావాలన్నది ప్రధానాంశం. 
*పురపాలన అంటే పాలనలో ప్రజలను భాగస్వాములను చేయడం, పురపాలనలో పౌరుడే కేంద్రబిందువు కావాలనీ, పౌరుడే పాలకుడు కావాలనే సదుద్ధేశ్యంతో సిటిజన్ ఫ్రెండ్లీ అర్బన్ పాలనను తీసుకురావాలనే ఉద్దేశ్యం. 
* అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం, అనుమతులు త్వరితగతిన ఇవ్వడం, పూర్తి పాలనను పారదర్శకంగా ఉండేలా చూసుకోవడం, నగర మరియు పట్టణ పాలనను సంస్థాగతంగా బలోపేతం చేయడం ఈ చట్టం ఉద్దేశ్యం. 


views: 635

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams