Current Affairs Telugu Daily

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితా

*ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) నివేదిక--శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (ఆర్‌జీఐఏ) ప్రయాణికుల వృద్ధి రేటులో ముందు ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
*గత సంవత్సరం ---ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో  బెంగళూరు ఎయిర్ పోర్ట్(1.5 కోట్ల మందికి ప్రయాణికులతో) తొలి స్థానంలో నిలిచింది.శంషాబాద్‌ విమానాశ్రయం మూడో స్థానం దక్కించుకుంది.
శంషాబాద్‌ విమానాశ్రయం గతేడాదితో పోలిస్తే ఈసారి 21.9 శాతం వృద్ధి రేటు సాధించింది.ప్రపంచంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య డెస్టినేషన్‌–టూరిస్టు ప్రదేశంగా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాముఖ్యత సంపాదించింది. 
* హైదరాబాద్‌ విమానాశ్రయం తర్వాత రష్యా ఫెడరేషన్‌లోని నుకోవ్‌ ఎయిర్‌పోర్టు, చైనాలోని జినాన్‌ ఉన్నాయి. 
* ప్రస్తుతం ఇక్కడి నుంచి 29 ఎయిర్‌లైన్స్‌ దేశీయంగా, అంతర్జాతీయంగా 69 ప్రదేశాలకు విమానాలను నడుపుతున్నాయి. 2015–2019 మధ్య కాలంలో ఏటా సుమారు 20 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు 60వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. 500కు పైగా విమానాలు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి. గతేడాదిలో ఇక్కడి నుంచి అత్యధిక మంది అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, థాయ్‌లాండ్‌లకు వెళ్లగా దేశీయంగా ఇక్కడి ప్రయాణికులు ప్రధానంగా ఢిల్లీ, ముంబై, బెంగళూర్, కోల్‌కతా, చెన్నైలకు ఎక్కువగా పయనిస్తున్నారు.
*డిజియాత్ర-- డిజియాత్ర పథకంలో భాగంగా జీఎమ్మార్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రారంభించిన ఫేస్‌ రికగ్నేషన్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయి. దీంతో ముఖకవళికల నమోదు ఆధారంగా ప్రయాణికుల తనిఖీని సులభతరం చేసిన మొట్టమొదటి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. అలాగే దేశీయ ప్రయాణికులకు ఈ–బోర్డింగ్‌ సదుపాయాన్ని కల్పించింది. బ్యాగ్‌ ట్యాగ్‌లను తొలగించిన మొట్టమొదటి విమానాశ్రయం. కేవలం హ్యాండ్‌ బ్యాగేజ్‌తో వచ్చే వారి కోసం ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెకిన్‌ ప్రవేశపెట్టారు.


views: 628

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams