Current Affairs Telugu Daily

చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లకై అన్వేషణ కష్టతరం 

*చంద్రగ్రహంపై సెప్టెంబర్ 20, 21 తేదీన అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు  ఏర్పరుచుకోవడంసాధ్యం కాలేదు. 
* చంద్రగ్రహంపై రాత్రివేళ మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్‌ వాతావరణం ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో పనిచేసే విధంగా విక్రమ్‌ రూపొందలేదు. చంద్రుడిపై రాత్రి అంటే.. భూమిపై 14 రోజులకు సమానం.
*అక్కడ పగలు కూడా పద్నాలుగు రోజలుంటుంది. చంద్రుడిపై రాత్రి  ప్రారంభం కావడంతోనే విక్రమ్‌ ల్యాండర్‌ పనిచేయడం ఆగిపోతుంది.
*చంద్రుడిపై విక్రమ్‌ ‘హార్డ్‌ ల్యాండింగ్‌’ జరిగిన సందర్భంగా  ఇది మరింత కష్టం అయింది. 
* సోలార్‌ ప్యానెళ్లు అనుకున్నరీతిలో సెట్‌కాకపోతే చార్జింగ్‌ అయిపోయి విక్రమ్‌ ఇక పని చేయదు. 
* సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్‌ ల్యాండర్‌ జాడ కోల్పోయింది. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. 
*తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు.
*ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోనుంది. 14రోజులపాటు సాగే చంద్ర రాత్రి ప్రారంభమైంది. 
*చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్‌ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
*విక్రమ్‌ ల్యాండర్‌.. అందులోని రోవర్‌ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. ఇక, 14 రోజుల తర్వాత పగటి సమయం మళ్లీ ప్రారంభమయ్యాక.. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ మళ్లీ విక్రమ్‌ ల్యాండర్‌ కోసం వెతకనుంది.అప్పటికి  విక్రమ్‌ దొరికే అవకాశాలు తక్కువ. 
*విక్రమ్‌లోని ఆటోమెటిక్‌ ల్యాండింగ్‌ ప్రోగ్రామ్‌(ఏఎల్‌పీ) విఫలం కావడంతో బ్రేక్‌లుగా పనిచేయాల్సిన థ్రస్టర్లు యాక్సెలరేటర్లుగా పనిచేసి ఒక్కసారిగా వేగాన్ని పెంచి గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్‌ ఢీకొని ఉండొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 


views: 614

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams