Current Affairs Telugu Daily

డీ విటమిన్‌ లోపం వల్ల మరణాలు

* క్యాన్సర్‌, గుండెజబ్బులతో సంభవిస్తున్న మరణాల కంటే డీ విటమిన్‌ లోపంతో జరుగుతున్న మరణాలే ఎక్కువని ‘యూరోపియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డయాబెటిస్‌’ నివేదిక ప్రకటించింది.
*డయాబెటిస్ ఉన్న వారిలో విటమిన్ డి లోపం వల్ల మరింత ముప్పు ఎక్కువగా ఉంది. 
ఈ నివేదిక ప్రకారం ఆరోగ్యవంతులతో పోల్చితే.. తీవ్రమైన డీ విటమిన్‌ లోపంతో బాధపడుతున్న 45-60 ఏళ్లవారు త్వరగా మరణించేందుకు మూడురెట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 
*సైలెంట్ కిల్లర్-- శరీరానికి అవసరమైన స్థాయిలో విటమిన్ 'D' ఉన్నట్లయితే, విధులన్నీ సాధారణంగా నిర్వహింపబడతాయి. ఎముకలు బలంగా, దంతాలు ఆరోగ్యకరంగా, మానసికపరమైన సంతోషం మరియు సమర్థవంతమైన బరువు నిర్వహణ ఉంటుంది. ఒకవేళ శరీరంలో విటమిన్ 'D' స్థాయిలో తగ్గుదల ఏర్పడినట్లయితే, బహిర్గతం అయ్యే లక్షణాలను మనం గుర్తించలేము. ఇలానే కొనసాగితే చాలా రకాల ఆరోగ్య సమస్యలు కలిగి మరణానికి కూడా దారి తీయవచ్చు అందుకే దీనిని ''సైలెంట్ కిల్లర్''గా పేర్కొంటారు.
*విటమిన్ డి-- రసాయన నామం-ErgoCalciferol and Cholecalciferol,ఇది కొవ్వులో కరిగే విటమిన్
* రోజువారీ మోతాదు --5.0 µg-10 µg
* విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధులు--Rickets and Osteomalacia. 


views: 616

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams