Current Affairs Telugu Daily

28 ఏళ్ల చరిత్రలో తొలి భారీ సంస్కరణ

*ఆర్థిక మందగమనానికి అడ్డుకట్ట వేసేందుకు దేశీయ కంపెనీలకు 1.45 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్రకటించారు.  కార్పొరేట్‌ పన్నును ఒకేసారి 10 శాతం వరకు తగ్గించారు. 
*1991లో భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల తర్వాత కార్పొరేట్‌ పన్నుల్లో ప్రకటించిన అతి పెద్ద రాయితీ ఇదే.
*దే శీయ ఆర్థిక వ్యవస్థ ఆరు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం, నిరుద్యోగిత రేటు 45 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరడం వల్ల ఈ సంస్కరణలు చేపట్టారు. 
*కార్పొరేట్‌ పన్ను 25.17 శాతానికి తగ్గించడంతో పాటు అన్ని వర్గాలకు భారీ ఎత్తున పన్ను వరాలు ప్రకటించారు.
*ఈ చర్యలను ఉద్దీపన 4.0 గా,  మినీ బడ్జెట్‌గా అభివర్ణిస్తున్నారు.
*దేశంలో కార్పొరేట్‌ పన్ను ఒక్క విడతలో 10 శాతం తగ్గించడం 28 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. 1997లో దేశంలో వాస్తవంగా వర్తించే కార్పొరేట్‌పన్ను రేటు గరిష్ఠ స్థాయిలో 38.05 శాతం ఉండేది.ఈ తగ్గింపు వల్ల భారతదేశ కార్పొరేట్ పన్ను  చైనా, దక్షిణ కొరియా దేశాలతో సమానంగా ఉంది . 
*కార్పొరేట్‌ పన్ను భారీగా తగ్గించడంతో పాటు సీతారామన్‌ ప్రకటించిన ఇతర వరాల కారణంగా ప్రభుత్వ ఖజానా రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం నష్టం. 
*  దీని వల్ల విత్తలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయడం కష్టం.
* ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గుతుంది. స్వచ్ఛభారత్‌ సెస్‌, ఎడ్యుకేషన్‌ సెస్‌తో పాటుగా ఇతర సర్‌చార్జీలు కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ కంపెనీలపై పడే వాస్తవిక పన్ను భారం 25.17 శాతానికి తగ్గుతుంది. ప్రస్తుతం అది 34.94 శాతం ఉంది.కనీస ప్రత్యామ్నాయ పన్ను (మాట్‌) నుంచి కూడా పూర్తి మినహాయింపు లభిస్తుంది.
*ప్రస్తుతం కొన్ని రకాలైన పన్ను రాయితీలు, మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందుతున్న కంపెనీలు కొత్త కార్పొరేట్‌ రేటు ప్రయోజనం పొందడానికి సిద్ధంగా లేకపోయినట్టయితే ఈ సవరణలకు ముందు అమలులో ఉన్న పన్నులు యథాతథంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనుభవిస్తున్న పన్ను విరామం లేదా పన్ను మినహాయింపుల గడువు ముగిసిన అనంతరం వాటికి కొత్త కార్పొరేట్‌ పన్ను రేటు 22 శాతం అమలులోకి వస్తుంది. ఈ కంపెనీలకు మాట్‌ 15 శాతానికి తగ్గించారు.
*ఈ ఏడాది అక్టోబరు 1వ తేదీ తర్వాత ఏర్పాటై 2023 మా ర్చి 31 లోగా ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించే కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గుతుంది . ఈ తగ్గింపుతో ఇలాంటి కంపెనీలపై వాస్తవిక పన్ను భారం 17.01 శాతానికి  తగ్గుతుంది.
*స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయిన కంపెనీలు తమ చేతిలో ఉన్న నగదు నిల్వలను షేర్‌హోల్డర్లకు పంచిఇవ్వడం లక్ష్యంగా ప్రకటించే షేర్ల బైబ్యాక్‌పై ఎలాంటి పన్ను విధించరు. ఈ ఏడాది జూలై 5వ తేదీకి ముందు బైబ్యాక్‌ ప్రణాళికలు ప్రకటించిన కంపెనీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
*దేశంలోని కార్పొరేట్‌ కంపెనీలన్నీ తమ లాభాల నుంచి నిర్బంధంగా రెండు శాతం నిధులు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతల (సీఎ్‌సఆర్‌) కోసం కేటాయించాలన్న నిబంధన ఇక నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలోని ఇంకుబేటర్లకు, ప్రభుత్వ నిధులతో పని చేసే విద్యా సంస్థలకు కూడా వర్తిస్తుంది.


views: 581

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams