Current Affairs Telugu Daily

శాసనసభ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ నియామకం

* ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ నియమితులయ్యారు.
*చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను, అలాగే ఎస్టిమేట్స్‌ కమిటీకి చైర్మన్‌గా రాజన్న దొర, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను నియమించారు. 
* పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ --చైర్మన్ గా  చిర్ల జగ్గిరెడ్డితో పాటు సభ్యులుగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం నియమించారు.
*ఎస్టిమేట్‌ కమిటీ చైర్మన్‌గా --రాజన్న దొర పీడిక(చైర్మన్‌)నియమితులయ్యారు. 
ప్రభుత్వ పద్దుల కమిటీ-- ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విభాగాల పద్దులపై శాసనసభకు  సమర్పించిన నివేదికలను కమిటీ పరిశీలిస్తుంది. సి ఎ జి వార్షిక నివేదికలోని అంశాలను పరిశీలిస్తుంది.  ఆర్థిక శాఖ ఏ ఏ అంశాలపై ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు చేయడానికి ప్రతిపాదనలు చేసిందో ఆ విషయాలను పరిశీలిస్తుంది.
 అంచనాల కమిటీ-- ప్రభుత్వ అంచనాలకు  సంబంధించిన విత్త సంస్కరణలకు, పరిపాలన సామర్ధ్యం  పెంపుదలకు సూచనలు ఇస్తుంది. ప్రభుత్వ పాలనలో సామర్థ్యాన్ని, ఆదా ను   పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తుంది. 
* ప్రభుత్వరంగ సంస్థల సంఘం-- ప్రతి సంవత్సరం కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును, వాటి ఖాతాల నిర్వహణను ,  వాటిపై ప్రభుత్వ నియంత్రణ అంశాలను పరిశీలిస్తుంది. 


views: 590

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams