Current Affairs Telugu Daily

కార్పొరేట్ పన్నులు తగ్గింపు 

*2019-20 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను చట్టానికి --- కేంద్ర ప్రభుత్వం దేశీయ కంపెనీలు, నూతన తయారీ రంగ సంస్థలకు కార్పొరేట్ పన్నులు  తగ్గించనున్నట్లు ప్రకటన. 
*వృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను 22 శాతానికి తగ్గించామని, నూతన తయారీ రంగ సంస్థలు 15 శాతం పన్ను చెల్లించే అవకాశం 
* కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో--బిగ్ బ్యాంగ్ సంస్కరణ , అమెరికా  కంపెనీలతో పోటీ పడటానికి భారతీయ కంపెనీలకు ఊతమిస్తుంది.
* అయితే కొత్త పన్ను చట్టం కింద కంపెనీలకు మినహాయింపులు, ప్రోత్సహకాలు ఉండవు.
*కేంద్రం తాజా నిర్ణయంతో సర్‌చార్జిలు, సెస్‌తో కలిపి దేశీయ కంపెనీల పన్ను రేటు 25.7 శాతంగా ఉండనుంది. 
 కార్పోరేషన్ పన్ను----జాయింట్ స్టాక్ కంపెనీ లు, కార్పోరేషన్ లపై విధించే పన్నులను కార్పోరేషన్ పన్ను (Corporate Tax) అని పిలుస్తారు.  ఇది వ్యక్తులపై కాకుండా సంస్థలపై, కంపెనీలపై మాత్రమే విధిస్తారు. కంపెనీలు ఆర్జించే నికర ఆదాయం పై ముందుగా కార్పోరేషన్ పన్నును చెల్లించవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే లాభాల కింద వాటాదార్లకు పంచవలసి ఉంటుంది. వాటాదారులు లేదా కంపెనీ యజమానులు వారివారి ఆదాయాలపై ఆదాయపు పన్నును కూడా చెల్లించవలసి ఉంటుంది.


views: 594

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams