Current Affairs Telugu Daily

డయాబెటిస్‌ నుముందే గుర్తించవచ్చు

*శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి క్రమంగా తగ్గడం వల్ల వచ్చే టైప్‌-2 డయాబెటిస్‌ సాధారణంగా మధ్య వయస్కుల్లో, వృద్ధుల్లో కనిపిస్తుంది.ముందే ఈ వ్యాధి లక్షణాలను కనిపెడితే దాన్ని నిర్మూలించే అవకాశం ఉంటుంది.
*బ్రిటన్‌ శాస్త్రవేత్తలు--రక్త నమూనాలు, జన్యుక్రమం విశ్లేషణ ఆధారంగా టైప్‌-2 డయాబెటిస్‌ లక్షణాలను 8 ఏళ్ల వయస్సులోనే గుర్తించారు.
*కణజాలాలు, జన్యుక్రమాల ఆధారంగా పరిశోధనలు జరిపారు. 
* టైప్‌ 2 డయాబెటిస్‌ లక్షణాలు ఉన్నవారిలో 8 ఏళ్ల వయస్సులో శరీరంలో హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం, 18 ఏళ్ల వయస్సులో శరీరంలో గ్లైకోప్రోటీన్‌ ఎసిటైల్‌, ఎమైనో ఆమ్లాల పెరుగుదలను గమనించారు.
*టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్, క్లోమ గ్రంధిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్‌హాన్స్‌లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలు సంఖ్యలో తగ్గిపోవడం లేదా నశించడం వల్ల ఏర్పడే ఇన్సులిన్ కొరత వల్ల కలుగుతుంది.
*టైప్‌ 2 డయాబెటిస్‌  ఇది జీవనశైలిలో మార్పుల వల్ల వస్తుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం.. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం.. వాతావరణ కాలుష్యం వంటివి ఇందుకు కారణాలుగా ఉంటాయి. టైప్1లో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధికాబట్టి ప్రాక్లియాన్స్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయవు. ప్రాక్లియాన్స్ యథావిధిగానే ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయి. అయితే  వాటిని రక్తంలోని గ్లూకోజ్ ను సమతుల్యంగా పెట్టేందుకు తీసుకెళ్లే నాళాలు సరిగా పనిచేయవు. దీని వల్ల గ్లూకోజ్ హెచ్చుతగ్గులు జరుగుతాయి. 


views: 604

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams