Current Affairs Telugu Daily

తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణమంత్రి

*స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. 
*30 నిమిషాల విన్యాసం --బెంగళూరులోని హెచ్ఏఎల్ నుంచి బయల్దేరింది.
*తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. తొలుత 40 యుద్ధ విమానాల కోసం హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ ( హెచ్ఏఎల్‌)కు రక్షణ శాఖ ఆర్డర్ ఇవ్వగా.. మరో 83 విమానాల కోసం 2018లో అనుమతిచ్చారు. వీటి విలువ రూ.50వేల కోట్లు ఉంటుంది.అరెస్టెడ్‌ ల్యాండింగ్‌’ అనే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా విమానవాహక నౌకపై క్షేమంగా దిగే సామర్థ్యాన్ని తేజస్‌ ప్రదర్శించింది. 
*ఇదివరకే స్టార్ షట్లర్ పీవీ సింధు తేజస్‌లో విహరించారు. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడంతో పాటు పలు ప్రత్యేకతలు తేజస్ సొంతం. ఈ యుద్ధ విమానానికి మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి తేజస్ అని నామకరణం చేశారు. తేజస్ అంటే సంస్కృత భాషలో తేజస్సు, వెలుగు అని అర్థం.
*భారతదేశంలోని  MiG-21 విమానాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడం కోసం Light Combat Aircraft కార్యక్రమం 1980 లో ప్రారంభమైంది.దీనినే తేజస్ గా పిలుస్తారు.సింగిల్ ఇంజన్, డెల్టా  వింగ్, మల్టీ రోల్ లైట్ ఫ్లైటర్. 


views: 600

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams