Current Affairs Telugu Daily

ఈ-సిగరెట్లపై నిషేధం -ఆర్డినెన్స్

*  యువత, పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ-సిగరెట్లపై నిషేధం విధించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర
*నిషేధం --ఈ-సిగరెట్ల తయారీ, ఎగుమతి, దిగుమతి, రవాణా, విక్రయాలు, పంపిణీ, నిల్వ, వాటికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలను ప్రదర్శించడం
*ధూమపానం అలవాటున్నవారు దాన్నుంచి బయటపడేందుకు ఒక మంచి మార్గంగా ఈ-సిగరెట్లను ప్రోత్సహించారు. కానీ, చాలామంది దీన్ని ధూమపానం మానడానికి ఉపయోగించడం లేదు.ఈ-సిగరెట్లకు బానిసవుతున్నారు.ఒక ఫ్యాషన్‌గా భావిస్తున్నారు.
*దేశంలో ప్రస్తుతం 400 బ్రాండ్ల ఈ-సిగరెట్లు 150 ఫ్లేవర్లలో లభ్యమవుతున్నాయి. వీటిలో భారతదేశంలో తయారవుతున్నవి ఏవిలేవు.
* ఈ-సిగరెట్లను కలిగి ఉన్నవారు వాటిని సమీపంలోని పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించాలి. అలా అప్పగించకుండా తమ వద్దే ఉంచుకుని దొరికిపోతే.. రూ.50,000 జరిమానా, ఏడాది దాకా జైలు శిక్ష విధిస్తారు. 
*మళ్లీ అదే తప్పిదానికి పాల్పడితే మూడేళ్ల దాకా జైలు శిక్ష లేదా 5 లక్షల జరిమానా, లేదా రెండూ విధిస్తారు.
*ఈ-సిగరెట్లు, హీట్‌-నాట్‌ బర్న్‌ ధూమపాన పరికరాలు, వేపింగ్‌ పరికరాలు, ఈ-నికోటిన్‌ ఫ్లేవర్డ్‌ హుక్కాలు
*ఈ సిగరెట్లు--వీటిలో పొగాకు ఉండదు. సిగరెట్‌ అంత ప్రమాదకరం కాకపోయినా, వీటిలో ఉండే రసాయనాలు కూడా హానికరం.  ఈ-సిగరెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అందులోని నికోటిన్‌ ద్రావకం పొగలాగా మారి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సిగరెట్‌ తాగిన అనుభూతినిస్తుంది. సిగరెట్‌ అలవాటు లేని యువత ఈ-సిగరెట్లవైపు ఆకర్షితులవుతున్నారు.  
*ఆర్డినెన్స్-  రాజ్యాంగంలోని 123 వ  ప్రకరణ ప్రకారం పార్లమెంట్  సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతికి ఆర్డినెన్సు  జారీచేసే అధికారం కలదు. పార్లమెంట్ లోని ఒక సభ మాత్రమే సమావేశం లో ఉండి మరో సభ సమావేశంలో లేనప్పుడు కూడా జారీ చేయవచ్చు. 
*ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి 6 నెలల 6 వారాలు 


views: 589

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams