Current Affairs Telugu Daily

ఇస్రో మరియు DRDO ఒప్పందం 

*మానవ సహిత అంతరిక్ష యాత్ర  గగన్ యాన్ పై రక్షణ, పరిశోధన, అభివృద్ధి  సంస్థ(DRDO) తో ఇస్రో ఒప్పందాలు కుదుర్చుకుంది. 
*వ్యోమగాములకు అంతరిక్షంలో అందాల్సిన ఆహారం, వారి ఆరోగ్య పర్యవేక్షణ, అత్యవసర  మనుగడ కిట్, రేడియో ధార్మిక పై కొలతలు, రక్షణ, భూమికి తిరిగి వచ్చే సమయంలో క్రూ  మాడ్యూల్ సులభంగా దిగేందుకు సహాయపడే పారాచూట్ లు వంటి అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. 
*గగన్‌యాన్‌---2022 నాటికి అంతరిక్షంలోకి భారత వ్యోమగామిని పంపించేందుకు ఇస్రో ప్రయత్నిస్తుంది. జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 వాహకనౌక ద్వారా చేపట్టబోయే ఈ ప్రయోగం ద్వారా వారం రోజుల పాటు మానవుడిని అంతరిక్షంలో ఉంచుతారు.పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.10వేల కోట్లకంటే తక్కువ వ్యయంతో పూర్తి చేయనున్నారు. 
భూమి నుంచి 300– 400 కిలోమీటర్ల ఎత్తు వరకు రాకెట్‌ ప్రయాణిస్తుంది. ఈ ప్రయోగానికి ముందు రెండు మానవ రహిత స్పేస్‌ క్రాప్ట్‌లను పంపుతారు. ప్రమాద సమయంలో వ్యోమగాములను సురక్షితంగా నేలకు దించే క్రూ మోడ్యూల్, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌లను పరీక్షించారు.వ్యోమగామికి లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్, స్పేస్‌ సూట్‌ లాంటి వాటిని తయారు చేస్తున్నారు. 
*2022 లేదా అంతకంటే ముందే ఓ భారతీయుడిని సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని 2018, ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించారు.
భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే 2022 నాటికి అంతరిక్షంలోకి త్రివర్ణ పతాకం  ఎగర వేయాలి అనేది లక్ష్యం.


views: 633

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams