Current Affairs Telugu Daily

వలస వెళ్లాలనుకునే వారు అధికంగా గల దేశాల జాబితాలో భారత్‌కు 2వ స్థానం
విదేశాలకు వలస వెళ్లిపోవాలనుకుంటున్న వారు ఎక్కువగా కలిగి ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. విదేశాలకు వలసల వెళ్లడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉద్దేశాలను 2010 నుంచి 2015 మధ్య అధ్యయనం చేసిన ఐక్యరాజ్యసమితి యొక్క అంతర్జాతీయ వలసల సంస్థ(IMO) నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో  నైజీరియా మొదటి స్థానంలో ఉండగా భారత్‌ 2వ స్థానంలో నిలిచింది. ఎక్కువ మంది అమెరికా, బ్రిటన్‌ను వలస వెళ్లానుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. విధానపరమైన పరిమితులు, వనరుల కొరత, మనసు మార్చుకోవడం వంటి కారణాలతో పలువురు తమ వలస ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నట్లు అంతర్జాతీయ వలసల సంస్థ(Iవీూ) నివేదిక వెల్లడించింది.
IMO-International Maritime Organization  
జాబితా
1    నైజీరియా
2    భారత్‌
3    కాంగో
4    చైనా    
5    బంగ్లాదేశ్‌

views: 1026Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams