Current Affairs Telugu Daily

 హైదరాబాద్‌-కర్ణాటక పేరు మార్పు

*కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప---చారిత్రక ప్రాధాన్యత కలిగిన హైదరబాద్‌-కర్ణాటక ప్రాంతాన్ని ఇకపై కళ్యాణ-కర్ణాటకగా వ్యవహరిస్తారు. కళ్యాణ-కర్ణాటక ప్రాంత సమగ్రాబివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేయనుంది. 
*గుల్బర్గ, బీదర్‌, రాయచూర్‌, యాదగిరి, బళ్లారి, కొప్పళ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని దశాబ్ధాలుగా హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతంగానే వ్యవహరిస్తున్నారు. 
*ఈ ప్రాంతం గతంలో హైదరాబాద్‌ కేంద్రంగా నిజాం రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. సంస్ధానాల విలీనం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కర్ణాటకలో కలిసినప్పటికీ ఆరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్‌-కర్ణాటకగానే వ్యవహరిస్తున్నారు. 
* హైదరాబాద్ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఇకనుండి కళ్యాణ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి బోర్డుగా  మారనుంది. 
* 118 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 371-J ను చేర్చి 2012వ సంవత్సరంలో కర్ణాటక ప్రాంతం లోని  ఈ ఆరు జిల్లాలకు ప్రత్యేక హోదా కల్పిస్తూ విద్య మరియు ఉద్యోగాల్లో స్థానిక ప్రజలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. 


views: 598

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams