Current Affairs Telugu Daily

తొలి తేలియాడే అణువిద్యుత్‌ కేంద్రం

 ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నీటిలో తేలియాడే అణు విద్యుత్‌ కేంద్రాన్ని రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోసాటమ్‌ అభివృద్ధి చేసింది.ఈ అణు కేంద్రం పేరు-- ‘ది అకడెమిక్‌ లొమొనోసొవ్‌’.
ఉద్దేశ్యం--దీన్ని రష్యాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్‌ సౌకర్యం అందించేందుకు అభివృద్ధి చేశారు.
* అణు విద్యుత్‌ కేంద్రం బరువు 21 టన్నులు
*ఎత్తు 470 అడుగులు
*ఆర్కిటిక్‌ మహాసముద్రంలో 5,000 కి.మీ ప్రయాణించి రష్యాలోని చుకోట్కాలో పీవెక్‌ అనే ప్రాంతానికి చేరుకుంది.
*సామర్ధ్యం--35 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు అణురియాక్టర్లు
*ఈ ఏడాది చివరికల్లా ‘ది అకడెమిక్‌ లొమొనోసొవ్‌’ అందుబాటులోకి రానుంది. ఇది ఓసారి పనిచేయడం ప్రారంభిస్తే 3 నుంచి ఐదేళ్ల వరకూ ఇంధనాన్ని మార్చాల్సిన అవసరముండదు.  
*దీన్ని ఓ ‘అణు టైటానిక్‌’గా రష్యాలోని గ్రీన్‌ పీస్‌ అనే పర్యావరణ సంస్థ పేర్కొంది.
*చుకోట్కా వంటి మంచు ప్రాంతాల్లో ఒకవేళ అణు విపత్తు సంభవిస్తే పర్యావరణంపై తీవ్రప్రభావం.
*లక్ష మందికి విద్యుత్ సౌకర్యం కల్పించవచ్చు.


views: 599Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams