Current Affairs Telugu Daily

22వ ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌-పంకజ్‌ అద్వానీ

*150–అప్‌ ఫార్మాట్‌లో టైటిల్‌ సాధించాడు. అతని కెరీర్‌లో ఇది 22వ ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ టైటిల్‌ కావడం విశేషం.మయన్మార్‌ ఆటగాడు నే త్వే వూపై విజయం సాధించాడు.
*భారత ‘క్యూ’స్పోర్ట్‌ కింగ్‌ పంకజ్‌ అద్వానీ బిలియర్డ్స్, స్నూకర్‌లో చాంపియన్‌.
*అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్షిప్ లో పంకజ్‌ గెలుపొందాడు.
* 2003లో తొలిసారి చాంపియన్‌షిప్‌ అందుకున్న అద్వానీ తదనంతరం టైమ్‌ ఫార్మాట్‌లో 8 సార్లు, పాయింట్స్‌ ఫార్మాట్‌లో 6 సార్లు ప్రపంచ బిలియర్డ్స్‌ టైటిల్స్‌ సాధించాడు. స్నూకర్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత క్యూ స్టార్‌ ప్రపంచ టీమ్‌ బిలియర్డ్స్, టీమ్‌ స్నూకర్‌లో ఒక్కోసారి విజయం సాధించాడు.


views: 716

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams