Current Affairs Telugu Daily

అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం 

*అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం లేదా అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం  ప్రతి సంవత్సరం తేదీన జరుపుకుంటారు.
Theme 2019--32 Years and Healing
1994లో, ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సెప్టెంబరు 16న "ప్రపంచ ఓజోన్ దినం"గా ప్రకటించాలని నిర్ణయించింది,
1987లో మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకం చేసిన తేదీకి జ్ఞాపకార్థంగా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం ఓజోన్ క్షీణతకు కారణమైన ఉద్గరాలను నిలిపివేయడానికి అంగీకరించాయి. క్లోరో ఫ్లోరో కార్బన్స్ మరియు  హాలోన్ లను ఓజోన్ క్షీణత రసాయనాలు గా గుర్తించారు . 
*98% క్లోరోఫ్లోరో కార్బన్ ల ఉత్పత్తిని తగ్గించింది. 
*లక్ష్యం-- పర్యావరణ మార్పులపై, ఓజోన్ పొర క్షీణత పై అవగాహన కల్పించడం. 
ఓజోన్ పొర-- అల్ట్రా వైలెట్   కిరణాలు భూమిని చేరకుండా భూమిని, జీవరాశులను  కాపాడుతుంది. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల పర్యావరణ మార్పుల వల్ల  ఓజోన్ పొర క్రమంగా దెబ్బతింటూ వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాల వల్ల  2030నాటికి ఉత్తరార్థ గోళంలో దెబ్బతిన్న ఓజోన్ పోర బాగు చేయబడుతుంది. 2050 నాటికి దక్షిణార్థ గోళంలో, 2060 నాటికి  ధ్రువ ప్రాంతాల్లో దెబ్బతిన్న ఓజోన్ పోర బాగు చేయబడుతుంది.
*ఆమ్లజని (ఆక్సీజన్‌) మరో రూపమే ఓజోన్‌. ఇది విషవాయువు. ప్రతీ ఓజోన్‌ అణువులోను మూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్‌ అణువులు (O2) విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సీజన్‌ పరమాణువు (O), ఆక్సీజన్‌ అణువులోకి చేరి (O3) ఆక్సీజన్‌ పరమాణువులుగా మారి ఓజోన్‌ అణువవుతుంది.

*వాతావరణపు గాలి పొరలో (భూ ఉపరితలానికి సుమారుగా 15 - 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది) ఓజోన్‌ సహజంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. వాహనాల కాలుష్యం నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల హైడ్రో కార్బన్‌ల స్థాయిలు పెరగడం వల్ల వాతావరణపు పైపొర భూఉపరితలానికి దగ్గర అయింది. సూర్యరశ్మిలో ఈ రసాయనాలు ఓజోన్‌గా మారతాయి. దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసవ్యాధిని పెంచడం శ్వాస కోశ వ్యాధులు మొదలగు సమస్యలను ఈ ఓజోన్‌ కల్గిస్తుంది. పంటలను కూడా నాశనం చేస్తుంది. వాతావరణపు గాలి పొరలో గల ఓజోన్‌ భూమిపై నున్న జీవరాశిని సూర్యుని నుండి వచ్చే అతినీలలో హిత కిరణాల నుండి రక్షిస్తుంది.
వాతావరణానికి దిగువున ఉన్న ఓజోన్‌ ఆరోగ్య సమస్యలను కల్గిస్తుంది.
క్లోరో ప్లూరో కార్బన్‌లు (CFCs) ఓజోన్‌ తరుగుదలకు ప్రాథమిక రసాయనాలు. రిఫ్రిజరేటర్లలో ఎయిర్‌ కండీషన్‌ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి.ఇవి క్లోరీన్‌ను కల్గి ఉంటాయి.
రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్‌.సిని విచ్చిన్నం చేసి క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.
మూడవ దశః ఈ క్లోరీన్‌ పరమాణువులు ఓజోన్‌ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్‌ తరిగి పోయేటట్లు చేస్తాయి.

కిగాలీ ఒప్పందం-మాంట్రియల్ ప్రోటోకాల్ ను సవరిస్తూ 2016 లో  రువాండా లోని కిగాలీ లో జరిగిన సదస్సులో జరిగిన ఒప్పందం పై 197 దేశాలు సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం 2045 సంవత్సరం నాటికి 80-85% వరకు  హైడ్రో ఫ్లోర్ కార్బన్ల తయారి, వినియోగం తగ్గించనున్నారు.2100 సంవత్సరానికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 0.50 C కి  నియంత్రించడం. 
మాంట్రియల్ ప్రోటోకాల్ కు ఇది సవరణ ఒప్పందం. 


views: 678

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams