Current Affairs Telugu Daily

తొలి లోకాయుక్తగా జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి

* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు.
*హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మఠం వెంకటరమణ, టెండర్ల న్యాయ పరిశీలన జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,  సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు.
*ఏపీ లోకాయుక్త కార్యాలయం ఇటీవల విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ భవనానికి మారింది.
*లోకాయుక్త ఉద్యోగుల విభజన మాత్రం ఇంకా పూర్తికాలేదు.ఉద్యోగుల విభజన పూర్తయ్యేంత వరకూ హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయం నుంచే జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తారు. 
*పదవీకాలం-  ఐదు సంవత్సరాలు.  
లోకాయుక్త పరిధి లోకి వచ్చేవారు--ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్య దర్శులపై వచ్చే ఫిర్యాదులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్‌ విప్‌లతో పాటు.. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపైనైనా కూడా ఫిర్యాదు చేయ వచ్చు. జెడ్పీ, మండల పరిషత్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్లు, సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు సభ్యులు, మునిసిపాలిటీ చైర్‌పర్సన్, ఇతర సభ్యులు తదితరులపై వచ్చే ఫిర్యాదుల న్నింటిపై లోకాయుక్త విచారణ జరపవచ్చు.
*లోకాయుక్త పరిధి లోకి రానివారూ --న్యాయమూర్తులు, జ్యుడీషియల్‌ సర్వీసు సభ్యులు.. లోకాయుక్త పరిధిలోకి రారు.రాష్ట్రంలోనే ఏదైనా కోర్టు అధికారి, ఉద్యోగి కూడా లోకాయుక్త పరిధిలోకి రారు. ఏపీ అకౌంటెంట్‌ జనరల్, ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఎన్నికల అధికారులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఏపీఏటీ చైర్మన్, ఇతర సభ్యులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉండదు.
*ఫిర్యాదు విధానం-అవినీతి, అధికార దుర్వినియోగం తదితరాల విషయంలో ఏ వ్యక్తి అయినా లోకాయుక్తను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదుదారు తన పూర్తి వివరాలతో ఫారమ్‌ 1, 2ను పూర్తిచేసి.. లోకాయుక్త రిజిస్ట్రార్‌ పేరిట రూ.150 ఫీజు చెల్లించాలి.
*తప్పుడు ఫిర్యాదు కు శిక్ష-- తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు తేలితే ఫిర్యాదుదారుని ప్రాసిక్యూషన్‌ చేయవచ్చు. గరిష్టంగా ఏడాది జైలు శిక్ష కూడా విధించవచ్చు. 
*లోకాయుక్త ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం- మహారాష్ట్ర
* అత్యంత శక్తివంతమైన లోకాయుక్త గల రాష్ట్రం-  కర్ణాటక 


views: 608

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams