Current Affairs Telugu Daily

గురునానక్ 550వ జయంతి

*సిక్కు మతాన్ని స్థాపించిన  గురునానక్ దేవ్ 550 వ జయంతిని పురస్కరించుకొని  యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్( యునెస్కో) గురునానక్ యొక్క  రచనలను అనువదించి, ముద్రించనున్నారు. 
* గురునానక్  సిక్కు మతంలో మొట్ట మొదటి గురువు. 
*అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ గుర్బాని అంటే వివిధ సిక్కు గురువుల రచనలు మరియు గురు గ్రంథ సాహిబ్ లోని రచనలను దేశం లో వివిధ భాషల్లో ముద్రించనున్నారు. 
*గురునానక్ 550వ జయంతి  సందర్భంగా భారతదేశం లో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు 
*పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాలోని  డేరా బాబా నానక్ నుండి అంతర్జాతీయ సరిహద్దు వరకు  కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం. గురుద్వార్ దర్బార్ సాహెబ్  కర్తార్పూర్ అనేది రావి నది ఒడ్డున కలదు. గురు నానక్ 18 సంవత్సరాలు ఇక్కడ గడిపారు. 
*స్మార్ట్ సిటీ నిర్మాణాల కింద sultanpur lodhi  పట్టణం అభివృద్ధి (గురునానక్ వివాహం ఈ పట్టణం లో జరిగింది)
*Sultanpur lodhi  రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం. 
* నాణేలు మరియు  స్టాంపులు విడుదల
* centre for inter faith studies(వివిధ మతాలవారు పాల్గొనే మత కార్యక్రమాలు) ని గురు నానక్ దేవ్ యూనివర్సిటీ లో ఏర్పాటు చేయడం. 
గురు నానక్ దేవ్ (Guru Nanak)
-------------------------------------
* 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు) ని నమ్మతారు. సిక్కు మతస్థాపకుడు. ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కులవ్యవస్థను వ్యతిరేకించిన గురువు. నానక్‌ తరువాత గురుపరంపర కొనసాగింది. ఐదవ గురువు అర్జున్‌, తనకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను, బోధలను సంకలనం చేసి ‘‘గురు గ్రంథ సాహిబ్‌’’ పవిత్రగ్రంథానికి రూపకల్పన చేశారు.
*గురు నానక్ తన జీవిత చివరి సంవత్సరాల్లో ఉచిత ప్రసాదం లభించే కర్తార్ పూర్ లో జీవించారు. తన ఆహారాన్ని మత భేదం, కుల భేదం, ధన భేదం లేకుండా పంచుకునేవారు గురు నానక్. గురు నానక్ పొలాల్లో పనిచేసి జీవిక సాగించేవారు. కొత్త సిక్ఖు గురువుగా భాయ్ లెహ్నాను ప్రకటించాకా 22 సెప్టెంబరు 1539లో 70వ ఏట మరణించారు.

*యునెస్కో

ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో), United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO), ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణ లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం మరియు సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటు పడుతుంది.
యునెస్కోలో 193 సభ్యులు మరియు 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, పారిస్, ఫ్రాన్సులో గలదు.


views: 650

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams