Current Affairs Telugu Daily

మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల విచారణ-ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు

*మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
*మొత్తం పెండింగ్ లో ఉన్న కేసులు--  1.66 లక్షలు
*ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులుపరిష్కరించేబోయే  కేసుల సంఖ్య- ఏడాదికి కనీసం 165 కేసులు.
 *389 కోర్టులు--లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసులను ప్రత్యేకంగా విచారిస్తాయి.
*634 కోర్టులు--అత్యాచార కేసులు లేదా అత్యాచార మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ కేసులను  విచారిస్తాయి. 
*బడ్జెట్‌--రూ. 767.25 కోట్లు.కేంద్ర ప్రభుత్వం రూ.474  కోట్లు  నిర్భయ ఫండ్ నుండి అందిస్తుంది. ఈ నిర్భయ ఫండ్ 2013లో ఏర్పాటు చేయడం జరిగింది.
*ఈ కోర్టులను అక్టోబర్  రెండవ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు. 
*పోక్సో చట్టం,2012----‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు–2019’ చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించేందుకు సవరణ.‘చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్‌ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు.
సుప్రీం కోర్ట్ --లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో) కింద 100కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన జిల్లాల్లో, పూర్తిగా కేంద్ర నిధులతో 60 రోజుల్లోపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
*. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి--స్మృతీ ఇరానీ


views: 615

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams