Current Affairs Telugu Daily

ఎగుమతిదారులు, రియల్టీ రంగం - ప్రభుత్వ ఉద్దీపన చర్యలు

మూడో విడత ఉద్దీపన చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
*ఎగుమతులు,రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధి చెందడానికి --- రూ.70,000 కోట్ల ప్యాకేజీ. 
*వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయినందున గతం లో రెండుసార్లు ఉద్దీపన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. 
*ఎగుమతి రంగం - కొత్త పథకం --ఎగుమతిదారులకు ప్రోత్సాహం అందించే చర్యల్లో భాగంగా కొత్త పథకాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. 
*రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ లేదా టాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రొడక్ట్‌ (ఆర్‌ఓడీటీఈపీ) ---మర్చంటైజ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్రమ్‌ ఇండియా స్కీమ్‌ (ఎంఈఐఎస్‌)  పథకం స్థానంలో కొత్త పథకం రానుంది. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల ద్వారా ప్రభుత్వం రూ.40,000-45,000 కోట్ల రిఫండ్స్‌ను అందిస్తోంది.2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఎగుమతులపై చెల్లించిన పన్నులను తిరిగి పొందే విధానం. ఈ స్కీమ్‌ కింద రూ.50,000 కోట్ల ప్రోత్సాహాలు అందుతాయి.
*దేశ ఎగుమతులు ఆగస్టు నెలలో 6.05 శాతం క్షీణించి 2,613 కోట్ల డాలర్లకు చేరింది. 
*జీఎ్‌సటీలో భాగంగా ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్స్‌ (ఐటీసీ)కు పూర్తిగా ఆటోమేటెడ్‌ ఎలక్ర్టానిక్‌ రిఫండ్‌ సదుపాయం కల్పిస్తారు. 
* ఎగుమతిదారులకు సంబంధించి సవరించిన ప్రాధాన్య రుణ వితరణ (పీఎ్‌సఎల్‌) నిబంధనలు ప్రకటించారు. వీటి అమలు ద్వారా ఎగుమతిదారులకు రూ.36,000 కోట్ల నుంచి రూ.68,000 కోట్ల వరకు అదనపు రుణాలు అందుతాయి.
*ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (ఈసీజీసీ) ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ పరిధిని విస్తరించనుంది. ఇది ఎంఎ్‌సఎంఈలకు లబ్ది చేకూరుస్తుంది. దీని మూలంగా రూ.1,700 కోట్ల వార్షిక భారం ఉంటుంది. 
*హౌసింగ్‌ ప్రాజెక్టులకు రూ.20,000 కోట్ల నిధి --తక్కువ నిధులు అవసరమయ్యే మధ్యాదాయ వర్గాలకు చెందిన ప్రాజెక్టులు, పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వీరు గుర్తిస్తారు.నిర్మాణంలో ఉండి నిలిచిపోయిన హౌసింగ్‌ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలుగా రూ.20,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. దీనిలో ప్రభుత్వం రూ.10,000 కోట్లు,ఇన్వెస్టర్లు (ఎల్‌ఐసీ, సావరిన్‌ ఫండ్స్‌వంటివి) రూ.10,000 కోట్లు సమకూరుస్తారు. 
* ఈ నిధి మూలంగా దాదాపు 3.5 లక్షల మంది మధ్య తరగతి గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుంది.నగదు కొరత కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు పూర్తి చేసే అవకాశం. 
*నగదు కొరత, డిమాండ్‌లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోందని, ఫలితంగా దాదాపు 8.5 లక్షల గృహ కొనుగోలుదారులు సొంత ఇల్లు నిర్మించుకునే లేకపోతున్నారు. 
*ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ వడ్డీ రేటుకు రుణాలను పొందేందుకు ‘హౌస్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌’పై వడ్డీ రేటును తగ్గించనున్నారు.
*అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభించేలా మార్గదర్శకాలను సరళీకరిస్తారు.


views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams