Current Affairs Telugu Daily

ఎగుమతుల క్షీణత 

*ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6 శాతం క్షీణత నమోదయ్యింది. దిగుమతులు 13.45 శాతం క్షీణత,విలువ 39.58 బిలియన్లుగా నమోదయ్యింది.
*ఈ ఏడాది జూలైలో ఎగుమతులు స్వల్పంగా 2.25 శాతం వృద్ధి చెందాయి.
*ఆగస్టులో ఎగుమతుల విలువ 26.13 బిలియన్‌ డాలర్లు. 2018 ఆగస్టుతో పోల్చితే విలువ 6 శాతం క్షీణించింది. పెట్రోలియం, ఇంజనీరింగ్, తోలు, రత్నాలు, ఆభరణాల విభాగంలో వృద్ధిలేదు.
*ఎగుమతులకు సంబంధించి మొత్తం 30 కీలక రంగాలను చూస్తే, 22 ప్రతికూలంగాఉన్నాయి.
*రత్నాలు ఆభరణాల విభాగంలో –3.5% క్షీణత, ఇంజనీరింగ్‌ గూడ్స్‌ విషయంలో 9.35% క్షీణత, పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో 10.73% క్షీణత నమోదయ్యింది.
* సానుకూలత నమోదు చేసిన రంగాలు---ముడి ఇనుము, ఎలక్ట్రానిక్‌ గూడ్స్, సుగంధ ద్రవ్యాలు, మెరైన్‌ ప్రొడక్టులు 
*ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.45 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఆగస్టులో వాణిజ్యలోటు 17.92 బిలియన్‌ డాలర్లు.  
* ఆగస్టులో చమురు దిగుమతులు 8.9 శాతం పడిపోయి 10.88 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు కూడా 15 శాతం క్షీణించి, 28.71 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
* తయారీ రంగం మందగమనంతో జూలైలో తయారీ రంగం వృద్ధి కూడా 4.3 శాతానికి పరిమితం అయ్యింది. 
*ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ చూసుకుంటే, భారత్‌ ఎగుమతులు 1.53 శాతం క్షీణించి, 133.54 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు కూడా 5.68 శాతం పడిపోయి 206.39 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్యలోటు 72.85 బిలియన్‌ డాలర్లుగా ఉంది.


views: 586

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams