Current Affairs Telugu Daily

లఘు వ్యాపారిక్ మాన్  ధన్ యోజన మరియు స్వరోజ్గార్ పథకాల ప్రారంభం 

 ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా లఘు వ్యాపారిక్ మాన్  ధన్ యోజన మరియు స్వరోజ్గార్ పెన్షన్ పథకాలను ప్రారంభించారు. అలాగే ఝార్ఖండ్ సచివాలయ  కొత్త భవనాన్ని ప్రారంభించారు.  
*18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు.  షాప్ కీపర్లు, స్వయం ఉపాధి ఉన్న వ్యక్తులు, జిఎస్టి  టర్నోవర్ రూ..1.5 కోట్ల లోపు ఉన్న రిటైల్ వ్యాపారులు అర్హులు. 
* అర్హత ఉన్నవారు నెలకు  మూడు వేల రూపాయలను 60 సంవత్సరాల వయస్సు తరువాత పొందుతారు. 
* కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 2019-20  బడ్జెట్ లో రూ.750 కోట్లు కేటాయించింది.  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను   పెన్షన్ ఫండ్ మేనేజర్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి పూర్తి బాధ్యత వహిస్తుంది. 


views: 605

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams