Current Affairs Telugu Daily

ఇండియా సింగపూర్‌ – ది నెక్ట్స్‌ ఫేజ్‌ సదస్సు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఇండియా సింగపూర్‌ – ది నెక్ట్స్‌ ఫేజ్‌ సదస్సు లో  పాల్గొన్నారు. 
ఈ సమావేశంలోమంత్రి పేర్కొన్న ముఖ్యమైన అంశాలు --
*నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు అమలు  చేస్తున్నట్లు తెలిపారు. సత్వర ఆర్థిక అభివృద్ధి. 
*భవిష్యత్తు మానవవనరులను సిద్ధంచేయడానికి మానభివృద్ధి రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం, బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక భద్రత కల్పించడం, పరిపాలనలో పారదర్శకతను సాధించడం, ఈ నాలుగు అంశాల ప్రాతిపదికగా సమగ్రాభివృద్ధి వ్యూహాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు. 
*2034 నాటికి 850 బిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదిగే అవకాశం. 
* విద్య, ఆరోగ్యం, సంరక్షణ, పౌష్టికాహారం, మహిళా సంక్షేమం, యువకులకు, విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వటంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరణ. 
*రాష్ట్రంలో 30శాతం జీఎస్‌డీపీ వ్యవసాయ అనుబంధరంగాలది.2030 నాటికి మౌళిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగం, పట్టణాభివృద్ధి రంగాల్లో ప్రతిఏటా 300 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేయాల్సి వస్తుంది
*వైజాగ్‌ – చెన్నై, చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో పెట్టుబడుల ద్వారా ఆ జోన్లను మరింత బలోపేతం చేయనున్నారు. కనెక్టివిటీని మరింత పెంచడానికి గ్రీన్‌ఫీల్డ్‌ఎయిర్‌ పోర్టును బలోపేతం చేయడమే కాకుండా, మరో రెండు ఎయిర్‌ పోర్టులను కూడా అభివృద్ధి చేయనున్నారు .
* గ్రామ సచివాలయాల ద్వారా అధికార వికేంద్రీకరణ, ప్రజల ముందుకు ప్రభుత్వ సర్వీసులను  తీసుకు వచ్చే ప్రయత్నం. 


views: 623

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams