Current Affairs Telugu Daily

మేరీ కోమ్, పీవీ సింధు లకు పద్మఅవార్డులు

*మేరీ కోమ్, పీవీ సింధులను అత్యున్నత పురస్కారాలకు క్రీడా మంత్రిత్వ శాఖ నామినేట్ చేసింది.
బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్‌ను పద్మవిభూషణ్‌కు, బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన పీవీ సింధును పద్మభూషణ్‌కు ప్రతిపాదించింది.
*పద్మవిభూషణ్‌కు నామినేట్ అయిన తొలి క్రీడాకారిణిగా మేరీ కోమ్ రికార్డులకెక్కింది. మొత్తం తొమ్మిదిమంది క్రీడాకారులను పద్మపురస్కారాలకు ప్రతిపాదించారు. 
* మేరీ కోమ్ ---2013లో పద్మభూషణ్, 2006లో పద్మశ్రీ అవార్డులను మేరీ కోమ్ అందుకున్నారు.
* పీవీ సింధు--2015లో పీవీ సింధు పద్మశ్రీ  అందుకున్నారు.
*పద్మ భూషణ్ పురస్కారము జనవరి 2, 1954లో నెలకొల్పబడింది. ఈ పురస్కారమును భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన భారతీయ పౌరులకు బహూకరిస్తారు. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత ఈ పురస్కారమునకు ప్రాముఖ్యతలో మూడవ స్థానం ఉంది.


views: 632

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams