Current Affairs Telugu Daily

ట్రాఫిక్‌ రూల్స్‌ అమలు రాష్ట్రాలనిర్ణయం

* ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారి మీద విధించే జరిమానాలపై దేశవ్యాప్తంగా నిరసన లు వ్యక్తమయ్యాయి. 
*సెప్టెంబరు 1 నుంచి కొత్త మోటారు వాహనాల చట్టం(సవరణ)-2019 అమల్లోకి వచ్చింది.మోటారు వాహనాల చట్టం-1988 ని సవరించారు.
ఈ చట్టాన్ని అమలు చేయడం రాష్ట్రాల ఇష్టానికే కేంద్ర ప్రభుత్వం వదిలేసింది. అలాగే  రాష్ట్రాలు చట్టంలోని జరిమానాలను తగ్గించవచ్చని కేంద్రం పేర్కొంది. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కేంద్రం, రాష్ట్రాలు తమకు నచ్చినట్లు చట్టాలు చేసుకోవచ్చు
*కేంద్రం వాదన

-----------------

పెరుగుతున్న ట్రాఫిక్‌ ప్రమాదాలకు రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లక్షన్నర మంది చనిపోతున్నారు. ఇందులో 65 శాతం మంది యువత ఉన్నారు.ఆదాయం కోసం కాకుండా  ప్రజల ప్రాణాలు కాపాడడానికి అధిక జరిమానాలు విధించడం జరుగుతుంది. 
దేశంలో దాదాపు 30 శాతం డ్రైవింగ్‌ లైసెన్సులు నకిలీవిఉన్నాయి. వాటిని తొలగించడానికి  ఈ జరిమానాలు. 

* పంజాబ్‌,గుజరాత్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలు కేంద్ర చట్టాన్ని యధాతధంగా  అమలుకు చేయరాదని నిర్ణయించాయి. 
*రవాణా హైవేల శాఖ మంత్రి -- నితిన్‌ గడ్కరీ 
*లక్ష్యం -- ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, రహదారి భద్రత, నిబంధనల ఉల్లంఘనపై జరిమానాతో పాటు అవినీతిని అరికట్టడం 
చట్టం లోని అంశాలు
-----------------------
*తాగి వాహనం నడిపితే జరిమానా  రూ.2,000 నుండి రూ.10వేలకు పెంచారు.
*పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపితే రూ. 5వేలు
*రోడ్డు ప్రమాద మృతులకు  రూ. పది లక్షలు, తీవ్రంగా గాయపడితే  రూ. 2 లక్షలు పరిహారం 
*ప్రైవేటు రవాణా సంస్థలు లైసెన్సింగ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా 
*ఓవర్‌ లోడింగ్‌ వాహనాలు రూ.  20,000 జరిమానా
*డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరిమానా
*రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారికి, లేదా సమాచారం అందించిన వ్యక్తులు వేధింపులకు గురికాకుండా ఉండేలా సవరణ.
*ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సున్న ఒక వ్యక్తి  డ్రైవింగ్ లైసెన్స్ 20 వరకు సంవత్సరాలు చెల్లుతుంది.
*లైసెన్స్ హోల్డర్ వయస్సు 30-50 సంవత్సరాల మధ్య ఉంటే 10 సంవత్సరాల వరకు  మాత్రమే( ప్రస్తుతం 20 ఏళ్ళతో పోలిస్తే) చెల్లుతుంది. 


views: 610

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams