Current Affairs Telugu Daily

 అస్సామ్‌లో రూ.13,000 కోట్ల పెట్టుబడులు

అస్సామ్‌లో చమురు అన్వేషణ, ఉత్పత్తి  నిమిత్తం ఓఎన్‌జీసీ ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.అస్సామ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో  ఓఎన్‌జీసీ(ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) MOU కుదుర్చుకుంది. 
*రాష్ట్రంలోని 220 ఆయిల్ మరియు గ్యాస్ బావుల హలో తవ్వకాలు చేపట్టారు. 
*2022 కల్లా దిగుమతులను 10% మేర తగ్గించుకోవాలన్నది లక్ష్యం. 
* నార్త్‌ఈస్ట్‌ హైడ్రోకార్బన్‌ విజన్‌ 2030లో భాగంగా  ఓఎన్‌జీసీ ఈ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించింది.
*అస్సామ్‌లోని జోర్హాట్, గోల్హాట్‌ జిల్లాల్లో ఆరు బావులు, ఐదు మైనింగ్‌ బ్లాక్‌ల్లో డ్రిల్లింగ్‌ కోసం ఆమోదం.
* 2018-19 ఆర్థిక సంవత్సరంలో, ONGC  0.797 మిలియన్ టన్నుల ఆయిల్ మరియు 407.40  మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల  గ్యాస్ ను ఉత్పత్తి చేసింది. 
* ONGC దేశవ్యాప్తంగా గా రూ 86,000  కోట్ల పెట్టుబడులతో 27 ప్రాజెక్ట్ లను  నిర్వహిస్తోంది. ఇందులో 18 అభివృద్ధి సంబంధిత  ప్రాజెక్టులు ఉండగా మిగతా తొమ్మిది మౌలిక సదుపాయాల  ప్రాజెక్టులు కలవు.  

HYDROCARBON VISION 2030 FOR NORTH-EAST

----------------------------------------------------------------------- 
*పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ  ఈశాన్య రాష్ట్రాల్లో హైడ్రోకార్బన్ల దీర్ఘకాలిక  గుర్తింపు, తవ్వకాల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి  ఈ విధానం పనిచేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో గల హైడ్రోకార్బన్ లను గుర్తించడం ద్వారా స్వచ్ఛమైన ఇంధనాన్ని పొందడం, పెట్రోలియం ఉత్పత్తుల వాటిని పెంచడం, సామాన్య ప్రజలకు  అభివృద్ధి మరియు ఆర్థికంగా ఉపాధి అందించడం జరుగుతుంది. 
*ప్రజలు, విధానం, భాగస్వామ్యం, ప్రాజెక్టులు, ఉత్పత్తి(People, Policy, Partnership, Projects and Production) అనే దానిపై ఆధారపడి ఈ విధానం రూపొందించబడింది. 
* 2030నాటికి  ఆయిల్ మరియు గ్యాస్ ఉత్పత్తిని  రెండింతలు చేయడం లక్ష్యం. 
*  ఈ ప్రాంతంలో హైడ్రోకార్బన్ల ఉత్పత్తి చేపట్టడం వల్ల  నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్ వంటి దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేయవచ్చు. 


views: 577

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams