Current Affairs Telugu Daily

 ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతుల  వేలం

 ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులను సెప్టెంబర్‌ 14 నుంచి ఆన్‌లైన్‌లో వేలానికి కేంద్ర సాంస్కృతిక శాఖ ఉంచనుంది.
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి --ప్రహ్లాద్‌సింగ్ పటేల్.
*వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని గంగా నదిని శుభ్రపరచం కోసం మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజక్ట్‌కు కేటాయిస్తారు. 
*గత ఆరు నెలల కాలంలో మోదీకి 2,722 బహుమతులు వచ్చాయి.ఈ వస్తువులు న్యూఢిల్లీలోని నేషన్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌లో ప్రదర్శన కోసం ఉంచారు.వస్తువుల ధరలు రూ. 200 నుంచి మొదలుకుని రూ. 2.50 లక్షల వరకు ఉంటాయి.
*ఈ బహుమతుల్లో  భారతీయులు ఇచ్చినవే ఎక్కువగా ఉన్నాయి.మోదీకి వచ్చిన బహుమతులను వేలానికి ఉంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో తొలిసారిగా మోదీకి వచ్చిన బహుమతులను సాంస్కృతిక శాఖ వేలానికి ఉంచింది.


views: 596

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams