Current Affairs Telugu Daily

 భారత్‌ స్టేజ్‌–6  2020 ఏప్రిల్‌ 1 నుంచి అమలు

భారత్‌ స్టేజ్‌–6 (బీఎస్‌) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్నాయి. 
*ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి.  డెడ్‌లైన్‌ లోగానే బీఎస్‌–6 ఫ్యూయెల్‌ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావొచ్చు. 
*. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్‌–6 ఫ్యూయెల్‌ అందుబాటులో ఉంది.భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)తన ప్రణాళిక అమలును వేగవంతం చేసింది. 
*2019 అక్టోబరు – 2020 జనవరి మధ్య రిటైల్‌ స్టేషన్లలో బీఎస్‌–4 స్థానంలో బీఎస్‌–6 ఇంధనం సిద్ధం చేయనుంది.జనవరికల్లా నూతన ప్రమాణాలతో ఫ్యూయెల్‌ రెడీ గా ఉండనుంది. 
*బీఎస్‌–3 నుంచి బీఎస్‌–4కు మళ్లిన దానికంటే ప్రస్తుతం మరింత వేగంగా పనులు  జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని ఇతర ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో పోలిస్తే బీపీసీఎల్‌ కాస్త ముందుగా బీఎస్‌–6 ఫ్యూయెల్‌ విషయంలో ముందుకు వెళ్తుంది. 
*ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీఎల్‌) కూడా పనులు ప్రారంభించింది. డిసెంబరులో మొదలై మార్చికల్లా కొత్త ఇంధనంతో రిటైల్‌ ఔట్‌లెట్లు సిద్ధం కానున్నాయి.  
*పాత ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం మార్పిడికి రెండు మూడు నెలల సమయం పడుతుంది. అలాగే లో ఫ్యూయెల్‌ నాణ్యతనూ పరీక్షిస్తారు. 
*బీఎస్‌–4 ప్రమాణాల నుంచి బీఎస్‌–6 ప్రమాణాలకు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇప్పటికే రిఫైనరీల అభివృద్ధికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేసారు. 
*వాహన తయారీ సంస్థలు రూ.70,000–80,000 కోట్లు ఖర్చు చేసాయి. 
* బీఎస్‌–4 నుంచి బీఎస్‌–5 ప్రమాణాలకు బదులుగా బీఎస్‌–6కు మళ్లాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 వెహికిల్స్‌ విక్రయం, రిజిస్ట్రేషన్‌ మాత్రమే చేపడతారు.


views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams