Current Affairs Telugu Daily

 జ్యుడిషియల్‌ ప్రివ్యూ-హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి శివశంకరరావు

*ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు తీసుకు వచ్చిన ముందస్తు న్యాయ సమీక్ష చట్టం అమలుకు అన్నిసిద్ధంఅవుతున్నాయి.
*జ్యుడిషియల్‌ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి శివశంకరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
*మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 
*ప్రభుత్వ టెండర్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పారదర్శక విధానాన్నీ   ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. 
*ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత ప్రక్రియ కోసం హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జిని సూచించాలంటూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు.
* అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో జులై 26, 2019న న్యాయ సమీక్ష బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది.
*మౌలిక సదుపాయాలకు సంబంధించిన 25 రకాల పనులు ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత చట్టం పరిధిలోకి వస్తాయి. 
*పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటిన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. జడ్జి ఆ టెండర్‌కు సంబంధించిన పత్రాలను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు. 
*ఇందుకు సంబంధించి జడ్జి టెక్నికల్‌ టీమ్‌ నుంచి సలహాలు, సూచనలు, వివరాలు పొందవచ్చు. సంబంధిత శాఖ జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఆ తర్వాత 8 రోజుల పాటు జడ్జి వాటిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందిస్తారు. 
*.  ఈ విధానంలో మొత్తం 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదన ఖరారు అవుతుంది. ఆ తర్వాతే బిడ్డింగ్‌ ఎవరికీ అదనపు లబ్ధి చేకూర్చకుండా.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు అభించనున్నాయి.


views: 602

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams