Current Affairs Telugu Daily

సబ్‌కా విశ్వాస్‌

సబ్‌కా వికాస్ లెగసీ డిస్ప్యూట్   రిజల్యూషన్ స్కీమ్,2019. 
ఈ పథకం ద్వారా  legacy సేవాపన్ను, కేంద్ర ఎక్సైజ్ కేసులను  తగ్గించవచ్చు. 
* సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి  డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది.
* పన్ను పరిపాలన విభాగం కింద  పెండింగ్ లో ఉన్న వివాదాలను పరిష్కరించడం ద్వారా  ఎక్కువ సంఖ్యలో ఉన్న చిన్నతరహా పన్ను చెల్లింపుదారులకు  విముక్తి కలిగించడం లక్ష్యం . 
పన్ను చెల్లింపుదారులు  చెల్లించవలసిన పన్ను చెల్లించి అవకాశాన్ని కల్పిస్తుంది వడ్డీ మరియు ఎలాంటి జరిమానా లేకుండా.  పన్ను చెల్లించే అవకాశం కల్పిస్తుంది. 
ఈ పథకాన్ని  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ 2019లో ప్రకటించారు. 
పారిశ్రామికవేత్తలతో పాటు అందరికీ వెసులుబాటు కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన సబ్‌కా విశ్వాస్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 
* 2019 జూన్‌ చివరి నాటికి న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నవారు, షోకాజ్‌ నోటీసులు అందుకున్నవారు ఈ పథకంతో 70 శాతం రాయితీని పొందవచ్చు. 
* ఏపీలో మూడు వేల కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలు ఉన్నాయి.
*  పన్ను ఎగవేతదారులు సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 ఈ పథకం వల్ల పెండింగ్‌లో ఉన్న కేసులు ఉపసంహరించుకునే అవకాశంతో పాటు న్యాయస్థానాలపై కూడా ఒత్తిడి తగ్గుతుంది.
 *దేశవ్యాప్తంగా 3. 75 లక్ష కోట్ల  ఎక్సైజ్ మరియు సేవ పనుల కేసులు నిలిచిపోయి ఉన్నాయి . 


views: 579

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams