Current Affairs Telugu Daily

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలకు ప్రత్యేక సాయం

ఉభయ గోదావరి జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలకు ప్రత్యేక సాయంగా రూ. 10 కోట్ల 9 లక్షల 20వేలను విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గోదావరి వరదల కారణంగా ఇళ్లు నష్టపోయిన కుటుంబాలకు రూ. 5వేల చొప్పున సాయం అందజేస్తారు . వరదల కారణంగా ఒకవారంపాటు నీటిలో మునిగిపోయి ధ్వంసమైన, శిథిలమైన ఇళ్లకు సాయంగా రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది.
*ఈ నిధుల్లో రూ. 7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా.. రూ. 2,87,45,000 పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించింది.


views: 606

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams