Current Affairs Telugu Daily

భారతదేశ ఐటి పరిశ్రమ చరిత్రలో మైలురాయి లాంటి కేసు

*యాక్సెంచర్, కాగ్నిజెంట్‌, కాస్పెక్స్ కార్పొరేషన్ కంపెనీలపై హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఐటి ఉద్యోగులు కేసు నమోదు చేశారు.
*ఐటీ కంపెనీల్లో టెక్కీలకష్టాలు, పని ఒత్తిడి తదితర అంశాలపై ముఖ ఐటీ కంపెనీలపై ఉద్యోగులు కేసు నమోదు చేశారు.ఎక్కువ పని గంటలు, ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం, లీవు విధానం లాంటి అంశాలపై ఫోరమ్ ఎగైనెస్ట్  కరప్షన్‌ కార్యకర్త బృందంతో కలిసి వీరు తెలంగాణ పిల్‌ హైకోర్టులో దాఖలు చేశారు.
*ఉపాధి పేరిట రాష్ట్రంలో వైట్ కాలర్డ్ బానిసత్వం గా ఉద్యోగులు భావిస్తున్నారు. 
*ఈ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. దీనిపై నాలుగు వారాల్లో స్పందించాల్సిందిగా ఐటీ సంస్థలను ఆదేశించింది. అలాగే ఈవ్యవహారంపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  కూడా కోర్టు నోటీసులిచ్చింది.
*అదనపు వేతనం లేకుండా దాదాపు పది గంటల విధులు, కార్యాలయ క్యాబ్‌ల ద్వారా రోజువారీ ప్రయాణంలో 4-5 గంటలు గడపవల్సి రావడం,  సెలవులను సమయానికి కేటాయించకపోవడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి.
*2002 లో ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం తెలంగాణ, హైదరాబాద్, ఇతర ఐటి హబ్‌లలో వర్తించే చట్టాలు-అంశాలు
ఉద్యోగులను వారానికి 48 గంటలు/ లేదా రోజుకు 8 గంటలు పని ,ఓవర్ టైం వారానికి 6 గంటలు,  సంవత్సరానికి 24 గంటలు మాత్రమేప్రతి ఉద్యోగికి సంవత్సరంలో 15 రోజుల పెయిడ్ లీవ్, 12 రోజుల క్యాజువల్ లీవ్, మరియు 12 రోజుల సిక్ లీవ్ ఇవ్వాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  లో ఐటి సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్మిక చట్టాలను దాటవేయడానికి వీలు కల్పించింది.


views: 651

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams