Current Affairs Telugu Daily

యస్‌ బ్యాంక్‌లో  వాటా పేటీఎమ్‌ కొనుగోలు

*యస్‌ బ్యాంక్‌లో కొంత వాటాను డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజ సంస్థ, పేటీఎమ్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
*యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్, ఆయనకు సంబంధించిన సంస్థలకు యస్‌బ్యాంక్‌లో 9.6 శాతం మేర వాటా ఉంది. ఈ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి పేటీఎమ్‌  యాజమాన్య సంస్థ, వన్‌97 కమ్యూనికేషన్స్‌ చర్చలు జరుగుతుంది. పేటీఎమ్‌ వ్యవస్థాపకులు విజయ్‌ శేఖర శర్మకు ఇప్పటికే పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో వాటా ఉండటంతో ఆర్‌బీఐ ఆమోదాన్ని బట్టి ఒప్పందం ఉంటుంది. 
* ప్రస్తుతం సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక బ్యాంక్‌లో  5 శాతం మేర ఇన్వెస్ట్‌ చేయవచ్చు 
* యస్‌ బ్యాంక్‌ ఇటీవలనే క్యూఐపీ(క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌) ద్వారా రూ.1,930 కోట్ల నిధులు సమీకరించింది. 
*గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్‌ నష్టాలు భారీగా పెరిగాయి. 2019, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పేటీఎమ్‌ నష్టాలు 193 శాతం ఎగసి రూ.4,217 కోట్లకు పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.1.604 కోట్లుగా ఉన్నాయి. ఇక ఆదాయం రూ.3,052 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.3,232 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.4,864 కోట్ల నుంచి 60 శాతం ఎగసి రూ.7,730 కోట్లకు పెరిగాయి.


views: 596

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams